మీకు మా జోహార్లు

5:01 PM

9 నెలలు మోసి జన్మనిచ్చెది తల్లి.
20 సంవత్సరాలు మోసి మంచి భవిష్యత్తునిచ్చెది తండ్రి.
జీవితమే ధారపోసి స్వతంత్ర భారతావనికి జన్మనిచ్చి
భరత మాత బిడ్డలకు గొప్ప భవిష్యత్తునిచ్చిన
ఓ త్యాగమూర్తులారా! మీకు మా జోహార్లు.

మనిషి సుఖ సంతోషాల కోసం, భోగ భాగ్యాల కోసం పరితపిస్తాడు.
ఉన్న సుఖ సంతోషాలను, భొగ భాగ్యాలను పరిత్యజించి
స్వతంత్ర భారత దేశం కోసం,
భావి భారత పౌరుల ఉజ్వల భవిష్యత్తు కోసం పరితపించిన
ఓ కర్మ యోగులారా! మీకు మా జోహార్లు.

ఆధిపత్యం కోసం ప్రపంచ యుద్ధాల్లొ మనిషిని మనిషి చంపుకొంటున్న సమయమున
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యన్ని సాధించి
ప్రపంచానికే ఆదర్శమైన ఓ మార్గదర్శకులారా! మీకు మా జొహార్లు.

దేశ సేవలొ కనుమూసి,
భరత మాత హౄదయంలొ శాశ్వతంగా జీవిచే ఓ మహాత్ములారా!
భరత మాత బిడ్డాగా జన్మించటమె అదౄష్టం.
మీ జన్మ భరత మాత అదౄష్టం.
- విష్ణు




0 comments: